
పయనించే సూర్యుడు మే 18( సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, తరలింపులపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర విమర్శలు చేశారు. కాదలూరు గ్రామంలోని సృష్టి లేవట్ లో అక్రమంగా రేషన్ బియ్యం గోడమల్లో నిల్వ ఉంచి లారీల ద్వారా చెన్నైకి తరలిస్తున్నారు ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వచేసిన ఇంటి ఎదురుగా ఎస్సై నివాసం ఉండడం గమనార్హం ? నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ దందా బహిరంగంగానే సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీడీపీ, కూటమి నాయకుల అండతో రేషన్ మాఫియా వ్యవస్థీకృతంగా పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోతుందని, దీనివల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని అన్నారు. కాదలూరులో జరుగుతున్న అక్రమాలపై సంబంధిత శాఖలు వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అక్రమ నిల్వలు, రవాణాపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు మౌనం వీడకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కానీ ప్రజలు అనుకుంటుందో మాత్రం అయ్యా మాజీ ఎమ్మెల్యే ఒక్క రేషన్ బియ్యం మీదే కాదయ్యా ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఆ ఎన్నింటి మీది కూడా ప్రశ్నించాలయ్యా కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రశ్నించడం కాదు ప్రతిపక్షం లేనంత మాత్రాన ప్రశ్నించకూడదా ప్రతినిత్యం ప్రజలకు సేవ చేయాలని అనే సంకల్పం ఉంటే ప్రజల కోసం ప్రశ్నించాలని ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం ప్రతిరోజు పోరాటం చేయాలి అలా పోరాటం చేసిన వారే ఒక లీడర్ అని ప్రజలు అనుకుంటున్నారు