
(పయనించే సూర్యుడు మే 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) : ప్రపంచ రక్తపోటు దినోత్సవం మే 17 ను పురస్కరించుకొని రక్తపోటు వారోత్సవాలలో సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన పోలీస్ స్టేషన్ నందు ఎస్ ఐ అవినాష్ మరియు సిబ్బంది కి, పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారికి సుమారు 50 మందికి రక్తపోటు నిర్ధారణ పరీక్షలు డాక్టర్ ఎం లిఖిత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రక్తపోటు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. రక్తపోటును అశ్రద్ధ చేసినట్లయితే అంగవైకల్యానికి గురవటం జరుగుతుందని తెలిపారు కావున అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యూష శ్రీలక్ష్మి ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు