
ఎస్ కిరణ్ టీ యు సి ఐ జిల్లా అధ్యక్షులు.
:పయనించే సూర్యుడు మే 22మక్తల్ : భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని మే, 25, 2026న చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని గ్రామాలలో ప్రచారంలో భాగంగా ఉట్కూరు మండల పరిధిలోని పెద్దపొర్ల గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (అనుబంధం టీ యు సి ఐ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ కిరణ్ టీ యు సి ఐ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమబోర్డు ఉన్నా కార్మికులకు పూర్తి స్థాయిలో ఫలితాలు అందడం లేదు. రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ బీవోసీ కార్డులు లేవు. కార్డు తీసుకున్న కార్మికులు రెనివల్స్ చేసుకోలేకపోతున్నారు. కార్డు ఉండి రెన్యూవలైన కార్మికులకు క్లెయిమ్స్ సరిగ్గా అందడం లేదు. ఏ రకంగా చూసినా నిరక్షరాస్యులైన భవన నిర్మాణ కార్మికులకు సరళతరంగా లబ్ధి దొరకడం లేదు. దాంతో తీవ్రమైన నష్టాలకు గురియవు తున్నారు. అరవై సంవత్సరాల తర్వాత భవన నిర్మాణ కార్మికుడికి లేబర్ ఉపయోగానికి రావటం లేదు. భవన నిర్మాణ కార్మికుడుగా నెలకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తున్నా ఆ కార్మికుడికి పెన్షన్ సౌకర్యం లేదు. ప్రభుత్వ వాగ్దానాల్లో భాగంగా సహజంగానే పెన్షన్లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు, కార్మికుడిగా నమోదు చేసుకున్నప్పటికీ పెన్షన్లు ప్రకటించడానికి ప్రభుత్వం వెనుకాడుతున్నది. చలిలో వణుకుతూ, వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, ఆరు గాలం కష్టపడి నిర్మాణాలు, (ప్రాజెక్టులు, బిల్డింగ్లు, సెక్రటేరియేట్స్) చేస్తున్నా, జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నా పెన్షన్ ఇవ్వటం లేదు. 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 9000 రూపాయల పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి సంక్షేమ పథకాల అమలులో ప్రైవేటు ఏజెన్సీల రెనివల్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలతోని నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను రద్దుచేసి ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని కోరారు. సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రిలు కోల కృష్ణయ్య , చిన్న బాలు, కురుమయ్య, కొత్త గుడిసె నరసింహులు , కొల్లంపల్లి హనుమంతు, పాపల్లి అంజప్ప, వడ్డే అశోక్ బాలకృష్ణ సుండుకురుమప్ప బుర్ర అంజప్ప సుండు హనుమంతు సందప్ప నరసింహ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.