
పయనించే సూర్యుడు మే 22 (సూళ్లూరుపేట నియోజక వర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ని తడ మండలంలో బోలింగాల పేట దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది తడ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినది ఎక్కడెక్కడ నుంచో పొట్ట చేత పెట్టుకొని బతుకుతెరువు కోసం తడ చుట్టుపక్కల కంపెనీలో పనిచేసుకొని బతకదామని వేలాది మంది కార్మికులు వచ్చి తన చుట్టుపక్కల స్థిరపడ్డారు పొద్దు టి నుంచి కంపెనీలో కాయ కష్టం చేసుకుని బతుకుతున్న కార్మికులకు ఆరోగ్యం సరిలేక లక్షల ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిచ్చుకునే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే చూపించుకుందామనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దీన స్థితిలో ఉందో ఒకసారి వెళ్లి అధికారులు చూడండి ఈ ఆసుపత్రిని పట్టించుకునే నాధులే లేరాయే ఈ మండల పరిధిలో అనేక విదేశీయ పారిశ్రామిక వాడలో వెలసి ఉన్న ఆరోగ్య పరిస్థితులను ప్రాథమికంగా చూసుకునే వసతులు కూడా ఈ ఆసుపత్రిలో లేవన్నది ఈ ఆసుపత్రిని చూడంగానే తేటతెల్లమవుతుంది దీనిపై ఎక్కడ చూసినా అశుభ్రంగానే కనిపిస్తున్నాయి ఒంట్లో బాగాలేక వస్తే కొత్త రోగం వచ్చే తట్టుంది ఈ ఆస్పత్రిని బాగుపరిచే నాధుడు ఎవరో అని తడ చుట్టుపక్కల ప్రజలు అనుకుంటున్నారు