
( పయనించే సూర్యుడు మే 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ రాష్ట్రం యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వపరంగా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్ ను హైదరాబాదులోని వారి నివాసంలో కలుసుకొని శుభాకాంక్షలు తెలిపిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ మరియు అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడ రఘునాథ్ యాదవ్.యాదవుల అభివృద్ధికి మీ సేవలు అందించాలని, రాష్ట్రంలోని యాదవ కార్పొరేషన్ కు సంబంధించిన అన్ని శాఖలను బలోపేతం చేయాలి అని కోరారు.ఇట్టి కార్యక్రమంలో మెండే కృష్ణ యాదవ్,మాజీ సర్పంచ్ కావలి కృష్ణ యాదవ్,మేకల రాఘవేందర్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ షాద్ నగర్ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు నక్క బాల్ రాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు పద్మారం వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ జిల్లా యువత ఉపాధ్యక్షుడు దవ్వాజి శ్రీనివాస్ యాదవ్,నడి కూడ సంతోష్ యాదవ్,నడి కూడ నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొని శాలువాలతో ఘనంగా సత్కరించారు.