
– ‘చలో హైదరాబాద్’ కరపత్రాల విడుదల
గిరిజన నేత రూప్లా నాయక్ పిలుపు
( పయనించే సూర్యుడు మే 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) గిరిజన హక్కుల సాధనే ధ్యేయంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన "చలో హైదరాబాద్" గిరిజన మహా ధర్ణాను విజయవంతం చేయాలని గిరిజన నేత రూప్లా నాయక్ పిలుపునిచ్చారు. శనివారం కేశంపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు.ఈ సందర్భంగా రూప్లా నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలను పక్కన పెట్టి, అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా గిరిజన సమాజమంతా తరలివచ్చి ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కేశంపేట మండలం లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జేర్పుల రాజు నాయక్, వీరేందర్ నాయక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ దిప్లా నాయక్, భిక్య నాయక్, రమేష్ నాయక్, జీవా నాయక్, వార్డు సభ్యులు రమేష్ నాయక్, ఎమ్. రమేష్ నాయక్, మోహన్ నాయక్, అయోధ్య శ్రీనివాస్, పరశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.