
పయనించే సూర్యుడు మే 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన కాట్రేనికోన శాఖ గ్రంధాలయాన్ని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు బుధవారం సందర్శించారు. గ్రంధాలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పనపై లైబ్రేరియన్ కె. తులసి లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. సత్వరమే కాట్రేనికోన ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి రామారావు ని ఆదేశిస్తూ ఎలక్ట్రికల్ మీటర్ పొందుపరిచే విధంగా విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ తో మాట్లాడారు. మరమ్మత్తులకు సంబందించిన ప్రతిపాదనలు (ఎస్టిమేట్) త్వరగా రూపొందించాలని ఇంజనీర్ అసిస్టెంట్ మురళి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ పృద్వి, టైపిస్ట్ నరేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.