
పయనించే సూర్యుడు మే 28 (సూళ్లూరుపేట నియోజక వర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణం లోని గోశాలనందు ఒక లారీ ఆగి ఉంది ఈ లారీలో ఆవులు నాలుగు రోజులుగా ఉన్నాయి ఆహారం లేదు నీళ్లు లేవు ఆ మూగజీవాల అర్ధనాథాలు బాధ చూసి గోశాల వారిని వివరణ అడిగితే నాలుగు రోజుల ముందు చెన్నైకి బక్రీద్ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్నారని పోలీసు వారు ఆ లారీని ఆపి గోశాలనందు ఉంచారు అని తెలిపారు! అప్పటి నుండి ఆ లారీలో ఉన్న ఆవులు నిలబడుకొనే ఉన్నాయి పడుకోవడానికి లారీలో స్థలం లేదు ఇరికిరుగ్గా ఉంది కనీసం మేత లేదు నీళ్లు లేవు ఒకవేళ అక్రమ రవాణా చేస్తుంటే చేస్తున్న యజమానులపై కేసు నమోదు చేసి ఆ మూగ జీవాలని గోశాల కి అప్పగించాలి అలా చేయకుండా అక్కడే నాలుగు రోజుల నుంచి లారీలో ఉండడంవల్ల ఆ మూగజీవాలు ఆర్తనాదాలు చూస్తుంటే మనసును బాధపెడుతున్నాయి ఈ మూగజీవాలకి విముక్తి కలిగించేది ఎప్పుడు అని ఎదురుచూస్తూ ఉన్నాయి ఇకనైనా పోలీస్ అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ ఆవులను గోశాలకు అప్పగించి వాటిని విముక్తి చేసి స్వేచ్ఛని కలిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు