
బిడ్డ జీవితంలో మొదటి వెయ్యి రోజుల వ్యవధి జీవితకాల ఆరోగ్యానికి పునాది
( పయనించే సూర్యుడు మే 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఫరూక్నగర్ మండలం చింతగూడ గ్రామంలోని అంగన్వాడీ 1 అంగన్వాడి 2 కేంద్రాల్లో మొదటి 1000 రోజుల ప్రాధాన్యత గురించి మహిళలకు వివరించడం జరిగింది. మహిళలకు బిడ్డ జీవితంలో మొదటి వెయ్యి రోజుల వ్యవధి జీవితకాల ఆరోగ్యానికి అభివృద్ధికి పునాది అని గర్భం ధరించిన రోజు నుండి బిడ్డకు రెండేళ్లు ఉండే వరకు గడిచే దశ మీ బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తుందని వివరించారు. అదే విధంగా ఉత్తమమైన శరీరక పెరుగుదల నేర్చుకునే సామర్థ్యం పెరుగుదల మరియు దీర్ఘకాలిక వ్యాధుల్లో ముప్పు నుంచి రక్షణ చురూకైన మెదడు మరియు పోషణ లోపం నుంచి రక్షణ కలుగుతుందని అంగన్వాడీ టీచర్లు సువర్ణ, సుధారాణి ఆధ్వర్యంలో మహిళలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సువర్ణ సుధారాణి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.