
సన్మానించిన ఉప్పరిగడ్డ , దేవుని బండ తండా సర్పంచులు చందు నాయక్ శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు మే 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని ట్రాఫిక్ సిఐ శంకరయ్య సూచించారు. శుక్రవారం షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ శంకరయ్యను ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్, దేవుని బండ తండా సర్పంచ్ శ్రీను నాయక్, ప్రజాపక్షం షాద్ నగర్ పిసి ఇన్చార్జ్ దన్నారం రమేష్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ శంకరయ్య మాట్లాడుతూ వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే వాహనాలను నడిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలకు సర్పంచులుగా ఉన్న ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. గతంలో షాద్ నగర్ సిఐ విధులు నిర్వహించిన శంకరయ్య.. అప్పుడు చేసిన సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల్లో పొందిన విశ్వాసాన్ని ఒక్కసారి నెంబర్ వేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ పై శంకరయ్య సార్ కు ఉన్న అవగాహనను ఒకసారి నెమరు వేసుకున్నారు. అదే తరహాలో ట్రాఫిక్ పై పూర్తిస్థాయిలో అవగాహన కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్న తన పరిస్థితి తీసుకు వస్తే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. త్వరలోనే ట్రాఫిక్ పై ప్రజలకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.