
పయనించే సూర్యుడు 29 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భీంగల్ పట్టణములో లండన్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం భీంగల్ పట్టణంలోని లండన్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్,పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు, ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఆయనకు శాలువా కప్పి పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు. ప్రజా సేవలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ పలువురు నాయకులు ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ తనకు అందించిన గౌరవానికి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి విద్యాసంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం సభ్యులు న్యాయవాది గజ్జల చైతన్య, పురేందర్, పర్సా నవీన్, కొమ్ము భూమేశ్వర్, నీలకంఠం, కర్నె లక్ష్మణ్, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.