

కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ను ప్రారంభించిన సర్పంచ్
పాల్గొన్న డిప్యూటీ సర్పంచ్ వార్డ్ సభ్యులు
( పయనించే సూర్యుడు మే 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడు తండాలు కలిసి ఈరోజు కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ను ఘనంగా ప్రారంభించారు. తండా యువకులు అందరూ కలిసి తమ యొక్క మిత్రుడైన కీర్తిశేషులు రాకేష్ నాయక్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియాల కుంట తండా సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహన్ మాట్లాడుతూ… విద్యార్థులు యువకులు క్రీడల్లో రాణించాలని వాటితో పాటు చదువులో కూడా రాణించాలని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ఉన్నత స్థాయికి వెళ్లే విద్యార్థులకు యువకులకు తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ వార్డు సభ్యులు చాట్ పట్ రవీందర్, ప్రియాంక దేవేందర్, తావు సింగ్ నాయక్, గోపి, దేవి రవి నాయక్, నీలా భాస్కర్ నాయక్ ,జర్నలిస్టు నరేందర్ నాయక్, వివో రాజు,వినోద్ నాయక్, రవీందర్, ప్రవీణ్