
పయనించే సూర్యుడు మే 31 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అమలాపురంలో 'డ్రగ్స్ వద్దు' అవగాహన కార్యక్రమం – యువతకు హెచ్చరిక, వైద్య పరీక్షల నిర్వహణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో "డ్రగ్స్ వద్దు" అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ మీనా యువతను ఉద్దేశించి మాట్లాడారు.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించిన ఎస్పీ, యువత తమ భవిష్యత్తును పణంగా పెట్టవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ముందుగా పరీక్షలు నిర్వహించి అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాలు కఠినంగా ఉన్నందున యువత విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. "గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం" అంటూ పోలీసులు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, ముఖ్యంగా యువత సహకరించాలని కోరారు.పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం లో డీఎస్పీ టి ఏస్ ఆర్ కే ప్రసాద్,పట్టణ సీఐ వీరబాబు,రూరల్ సీఐ ప్రశాంత్ జిల్లా పోలీసు అధికారులు , ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు .