
హాజరైన సర్పంచ్ రామలింగం గౌడ్
వేసవి శిక్షణ శిబిరం నిర్వహణకు 51 వేల అందించిన కుమార్ గౌడ్
గ్రామ ప్రజలకు చెత్త బుట్టల పంపిణీ చేసిన కుమార్ గౌడ్
( పయనించే సూర్యుడు జూన్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా వేడుకలు ఫరూక్నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ… నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితంగా అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేయడానికి చెత్తబుట్టలను గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ చెత్త బుట్టలను సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరానికి కుమార్ గౌడ్ 51 వేల రూపాయలను సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు వార్డు సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు భార్య సంఖ్యలో పాల్గొన్నారు.