
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి 'ఈ రోజు స్థానిక భైంసా పట్టణంలోని భైంసా జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవo సందర్బంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరిస్తూ జాతీయ గీత ఆలాపన తరువాత ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటిల్ మాట్లాడుతూ,ఈ రోజు 1200 మంది అమరుల త్యాగాల ఫలితమే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం… వారి గురించి ఈ రోజు మనం జ్ఞాపకం చేస్కునే అవసరం ఎంతగానో ఉంది, కానీ మనం తెలంగాణ సాధించుకొని12 సంవత్సరంలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, కానీ గత మరియు ప్రస్తుత ప్రభుత్వల సరైన పాలనా తెలంగాణ ప్రజలకు అందివకపోవడం, అప్పుల కుప్పలుగా మారడంతో తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది అని, *కేంద్ర ప్రభుత్వము మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వల వైపల్యాల ద్వారా నిరుద్యోగులకు శాపంగా మారడం జరుగుతుంది.యువతకు ఉద్యోగం,రైతుకు భరోసా,పేదలకు సంక్షేమం అందినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుంది అని కార్యక్రమాన్ని ఉద్యేషించి మాట్లాడం జరిగింది.