
పయనించే సూర్యుడు జూన్ 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామ పంచాయతీలో పలుచోట్ల జరుగుతున్న వీబీజీ రామ్ జి పనులను ఎంపీడీఓ బి రాజేశ్వర ఎఫ్ సి పరిశీలించారు. ముస్టర్లను క్షుణ్ణంగా తణిఖీ చేశారు.ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీరు సౌకర్యం కల్పించాలని, ప్రాధమిక చికిత్సకి సంబందించిన కిట్లు అందుబాటులో ఉంచాలని క్షేత్ర సహాయకుల ను ఆదేశించారు. వడదెబ్బకు గురి కాకుండా ఉపాధి శ్రామికులు తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. అనంతరం పల్లంకుర్రు గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామాన్ని సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. తల్లికి వందనం, అక్షరాంధ్ర, సిటిజెన్ ఈకేవైసీ వంటి అంశాల గూర్చి ఆరాతీశారు. పౌర సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలని సిబ్బందిని ఆదేశించారు, అనంతరం జనగణన నమోదు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజల సహకారంతో జనగణన పారదర్శకంగా నిర్వహించాలని, అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు.సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓ( పి ఆర్ )ఎన్ శంకరనారాయణ, పంచాయతీ కార్యదర్శి రామారావు, టెక్నికల్ అసిస్టెంట్ లావణ్య & స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.*