
పయనించే సూర్యుడు జూన్ 4 (సూళ్లూరు పేట నియోజక వర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో చెరువులు కాలవలు మాయమైపోతున్నాయి ఒకప్పుడు చెరువులు ఉండేవి అనే విధంగా మాయమై పోతున్నాయి చెరువులు కాలవలు అక్రమాలకు గురవుతున్న స్పందించని అధికార యంత్రాంగం ఈ అధికారం యంత్రాంగం కాలయాపన చేసేందుకు మాత్రమే ఆఫీసుకు వస్తున్నారు అంతే తప్ప మండలంలో ఏం జరుగుతుందో వాళ్లకి అనవసరం చెరువులే కాలవలే కాకుండా ఏది కబ్జా అయిన స్పందించరు నెల అవుతే జీతం మాత్రం తీసుకుంటారు మండలంలో ఏమైనా వాలకు పట్టదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు చెరువుల్ని కాలవల్ని కబ్జా కాకుండా కాపాడమని జీవోలు పాస్ చేస్తున్నారే తప్ప చెరువులు కాలవలు కబ్జాకి గురైన సంగతి కూడా వాళ్లకు తెలీదు ఎందుకంటే వాళ్లు జీవో మాత్రమే పాస్ చేస్తారు ఆచరణలో కింద ఉన్న వాళ్ళు చూడాలి కింద ఉన్న ఆఫీసర్ల జీతం కోసమే పని చేస్తున్నారు తప్ప ఏం జరిగినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు రానున్నది వర్షాకాలం పైన వర్షం ఎక్కువ అయిందంటే కింద ఉన్న లోతట్టుప్రాంతమైన సూళ్లూరుపేటకి వేల లీటర్ల నీళ్లు సూళ్లూరుపేటలో పడి సూళ్లూరు పేట మునిగిపోయే పరిస్థితి వస్తుంది అది తెలిసి కూడా నిమ్మలంగా ఎలా ఉంటున్నారు అధికారులే చెప్పాలి రెండు సంవత్సరాల ముందు సాయి నగర్ వినాయకుడి గుడి సెంటర్ ఆర్టీసీ డిపో చెంగాలమ్మ టెంపుల్ సూళ్లూరు పేట కి మూడు దిక్కుల ఫుల్లుగా వాటర్ సూళ్లూరుపేట మూడు రోజులు అంధకారంలో ఉండింది అలాంటి రోజులు మళ్లీ రాకుండా సూళ్లూరుపేట ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే చెరువుల్ని కాలవల్ని కాపాడండి మొన్న ఈమధ్య సాయి నగర్ లో ఒక ల్యాండ్ విషయమై పెద్ద చర్చ జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అని కొందరు మా పట్టా ల్యాండ్ అని కొందరు యుద్దాలే జరిగినంత పని అయింది కానీ పైనుంచి సర్వే వాళ్ళు వచ్చి ఆ ల్యాండ్ చెరువు అక్రమాల్లో ఉందని నిర్ధారించి ఒక ఫామ్ సబ్మిట్ చేసి వెళ్లారు కానీ ఊరు నడిబొట్టులో ఉండే ల్యాండ్ మాత్రం చెరువు పోరంబోకు అయితే చెరువులకి కాలవలకి పక్కన ఉండే ఇల్లు మాత్రం పట్టా భూములు ఎలా అవుతాయి వీటిని అధికారులు దృష్టికి కనిపించవా సూళ్లూరుపేట నియోజకవర్గం లో అగ్రవర్ణాలు ఏం చేసిన తప్పు ఉండదు దళితుల దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని తప్పులే కనిపిస్తాయి ఇలాంటి నియోజకవర్గాన్ని కాపాడే నాథుడు ఎవరు చెరువుల్ని కాపాడండి మహాప్రభు అంటూ సూళ్లూరుపేట పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు ఫలానా దగ్గర చెరువు ఉండేది అని దుస్థితి సూళ్లూరు పేట ప్రజలకు రానివ్వకండి