
పయనించే సూర్యుడు జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు పిలుపుమేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహిద్దాం:- ఎమ్మెల్యే బుచ్చిబాబు పిలుపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో నగర పంచాయతీ 10వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ సందర్భముగా హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగముగా ఎమ్మెల్యే బుచ్చిబాబు మొక్కలు నాటిన అనంతరం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమమును పురస్కరించుకుని ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య గ్యాంగ్ వర్క్ నిర్వహించి విస్తృతస్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రకృతిని కాపాడాలని వీధుల శుభ్రత చెత్త తొలగింపు డ్రైన్ల క్లీనింగ్ వంటి కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని హరిత ముమ్మిడివరం అనే నినాదంతో ముమ్మిడివరం నగర పంచాయతీ నందు ఎక్కువ మొక్కలు నాటాలని కోరారు అనంతరం ఏఐఐబి ప్రాజెక్ట్ మరియు అమృత్2.0 ద్వారా క్రాప చింతలపూడి మరియు అగ్రహారం నందు నిర్మించే 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు, అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రజలంతా సైకిళ్లు ను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని బుచ్చిబాబు పిలుపునిచ్చారు రోజువారి జీవితంలో సాధ్యమైనంత వరకు సైకిల్ వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుందని తెలిపారు, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమముగా మార్చాలని బుచ్చిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ పి రవివర్మ, చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, గొల్ల కోటి దొరబాబు, సాగిరాజు సూరిబాబు రాజు, కట్టా సత్తిబాబు, గుద్దటి జమ్మి, ములపర్తి బాలకృష్ణ, సరిపెల్ల శ్రీను రాజు, తాడి జానకిరామ్, వెల్ల వీరాస్వామి నాయుడు, కర్రా దుర్గాప్రసాద్, జాగు సత్తిబాబు, మెండి కమల, కుడుపూడి మల్లేశ్వరి,విత్తనాల రవితేజ, నిమ్మకాయల విష్, మాదాల పరాంకుశం,ఏడిద శివ, యాళ్ల ఉదయ్, దంగేటి శ్రీను, సత్తి నూకరాజు, పబ్లిక్ హెల్త్ డి ఈ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఏ ఈ శ్రీమతి నీలిమ, ఏఈ కె శ్రీనివాస్, కూటమి నాయకులు,సచివాలయ మెప్మా మరియు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.