
పయనించే సూర్యుడు 5 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత:.. ఏ డి ఎం హెచ్ వో డాక్టర్ రవీందర్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ఏడిఎంహెచ్ వో డాక్టర్ రవీందర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆర్గుల్ గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతకు కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి హాని కలగకుండా జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజలు అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు.ప్రతి కుటుంబం పచ్చదనాన్ని పెంపొందించేందు కు కృషి చేస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు