
ఎం.ఎస్.పి.చట్టం చేసి అమలు చేయాలి*
పయనించే సూర్యుడు సూర్యుడుD.06.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్-. AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి.ప్రభాకర్ డిమాండ్*-. *ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా* *.కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని,ఎం.ఎస్.పి. చట్టం చేసి అమలు చేయాలని* AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, మరియు సహాయ కార్యదర్శి బి దేవరాం లు డిమాండ్* చేశారు.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏఐయుకేఎస్) జాతీయ మహాసభ పిలుపు మేరకు ఆర్మూర్ లో శనివారం నాడు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా సందర్బంగా ప్రభాకర్, దేవరాం లు మాట్లాడుతు: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులపై కక్షగట్టి కార్పొరేట్లకు అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నది. క్రమక్రమేనా వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ల చేతిలో పెట్టడానికి కుట్రపడుతున్నదని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ఎరువుల ధరలను ఒక్కో బస్తా పై 300 నుంచి 500 వరకు పెంచి రైతుల వెన్ను విరిచింది. ఎరువుల ధరలను పెంచడమే కాకుండా ఎరువులు రైతులకు అందకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులైన వరి ధాన్యం మాకు మొక్కజొన్న తదితర పంటలకు అరకొర మద్దతు ధరలు ప్రకటించి చేతులు దులుపుకున్నది. కనీస మద్దతు ధరల చట్టబద్ధత కల్పించడానికి ఎం ఎస్ పి చట్టాన్ని చేయమని రైతులు డిమాండ్ చేస్తుంటే అనేక ఆందోళనలు చేసిన చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లే ఉన్నది. ప్రధాని మోడీ రైతుల పై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే భారీగా పెంచిన ఎరువుల ధరలను తగ్గుంచాలని, ఎం.ఎస్.పి చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి అమలుకు పునుకోవడం లేదు అన్నారు. రైతుకు ఇచ్చే ఇందిరా ఆత్మీయ రైతు భరోసా ను సకాలంలో అందివ్వాల్ని, ఎరువులు, విత్తనాలను సమయనుకూలంగా అందించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి కిషన్ అధ్యక్షత వహించారు AIUKS జిల్లా నాయకులు ap గంగారాం యు రాజన్న జె శేఖర్ ఏ సాయులు, పోషన్న, టీ గంగాధర్ ఇ రమేష్, బద్రి, తదితరులు పాల్గొన్నారు.