
పయనించే సూర్యుడు గాంధారి 07/06/26 గాంధారి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కమిటీ ఆధ్వర్యంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా కమ్మరి సురేష్, ఉపాధ్యక్షులుగా వడ్ల నారాయణ, వడ్ల వెంకటేశం, వడ్ల రమేష్, వడ్ల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా ఆవుసుల శ్రీకాంత్, కార్యదర్శులుగా కమ్మరి సాయిలు, వడ్ల చిన్న విట్టల్, వడ్ల హన్మాండ్లు, కోశాధికారిగా వడ్ల చందు ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల భీమయ్య మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ ఐక్యంగా ఉండి మన హక్కులను కాపాడుకోవాలనికోరారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.