
( పయనించే సూర్యుడు జూన్ 06 షాద్ నగర్ నియోజక వర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)మీరు ఎక్కడ ఉద్యోగం చేసిన మంచి పేరు ప్రాఖ్యతలు సంపాదించాలని, చిన్న చిల్కమర్రి గ్రామభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని చిన్న చిల్కమర్రి సర్పంచ్ గడ్డం యాదగిరి అన్నారు. గ్రామ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా చిన్న చిల్కమర్రి గ్రామ కార్యదర్శి జగదీశ్ ను మరో ప్రాంతానికి బదిలీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేయడంలో గ్రామ కార్యదర్శి విశేష కృషి చేశారని వివరించారు.కొత్తగా విధులు నిర్వహించే ప్రాంతంలో కూడా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ అనేది తప్పనిసరిగా జరుగు తుందని వివరించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ నన్ను గ్రామస్థులు ఎంతగానో ఆదరించారని, నేను ఎక్కడికి వెళ్లినా ఈ గ్రామాన్ని మర్చిపోలేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ రెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వలిగి కృష్ణ, ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు కావాలి సత్యమ్మ, మంగమ్మ, మల్లేష్,సాయినాథ్ గౌడ్, లావణ్య,వాణి శ్రీ,పల్లె నర్సింహ రెడ్డి,గ్రామస్థులు కొత్త శేఖర్, తెలుగు యాదయ్య, అంగన్వాడీ టీచర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.