
:పయనించే సూర్యుడు మే 7మాగనూర్: మాగనూరు మండలంలోని అడవి సత్యవార్, కొత్తపల్లి గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి.మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను అధికారులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ AD విజయ భాస్కర్, మాగనూరు AE గంగాధర్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది అడవి సత్యవార్ సర్వే నెం. 105, కొత్తపల్లి సర్వే నెం. 247 స్థలాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. స్థల అనుకూలత, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం, లైన్ విస్తరణ అంశాలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, నాయకులు శివరాంరెడ్డి, నర్సింహారెడ్డి, కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సబ్స్టేషన్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సబ్స్టేషన్లతో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు, లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.