
ప యనించే సూర్యుడు జూన్ 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రూరల్ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షురాలు చప్పిడి శ్రీదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారు 12 సంవత్సరాల పాలన, పర్యావరణ దినోత్సవ సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమం, యోగ దినోత్సవం గురించి మండల అసెంబ్లీ కన్వినర్ మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోలకోటి వెంకట రెడ్డి, మండల ఇంచార్జి గనిశెట్టి వెంకటేశ్వర రావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు పి వి వి ఎస్ ఎన్ మూర్తి రాజు, నీటి సంఘం డైరెక్టర్ పి వి వి సత్యనారాయణ రాజు సమావేశం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ పధకాలు గురించి మండల వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ వి దుర్గా ప్రసాద్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల జనరల్ సెక్రటరీ జె కె వి ఆర్ సత్తిబాబు, మండల సెక్రటరీ నామాల దుర్గా పార్వతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగులపల్లి లావణ్య మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తదనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా భారత గౌరవ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ అమ్మ కోసం ఒక మొక్క నాటుదాం కార్యక్రమం లో మొక్కలు నాటడం జరిగింది