
వినతి పత్రం సమర్పించిన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్*
పయనించే సూర్యుడు, జూన్ 08, అశ్వాపురం: అశ్వాపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు మరియు నూతన ట్రాక్టర్ కొనుగోలుకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్ కు అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ వినతి పత్రం సమర్పించారు. అశ్వాపురం గ్రామ పంచాయతీ భవనం 1970 వ సంవత్సరంలో అప్పటి హోం మంత్రి జలగం వెంగళరావు ద్వారా నిర్మించబడింది అని దాదాపు యాభై ఆరు ఏళ్ల క్రితం నాటి ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది అని అనేకసార్లు మరమ్మత్తులు చేసినప్పటికీ ప్రయోజనం లేదు అని నూతన భవన నిర్మాణానికి స్థల సమస్య ఎదురు అవుతున్నది అని ప్రస్తుత భవన స్థితి, ప్రజలకు మరియు పంచాయతీ కార్మికులకు ప్రమాదకరంగా మారి ఈ వర్షాకాలంలో కూలిపోతుందేమో అన్నట్లు ఉంది అని జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు ఇంచార్జ్ డి పీ ఓ విద్యా చందన లను కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ముఖ్యంగా మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించేందుకు, ప్రజలకు సేవలు అందించేందుకు, ఇప్పటి భవనం అనుకూలంగా లేదు అనినూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి సుమారు ఐదు కుంటల స్థలం అవసరం అని అలాగే పాలకవర్గ సభ్యులు పదహారు మంది, ఎంపీటీసీలు నలుగురు, ఎంపీపీ మరియు ఇరవై రెండు మంది పంచాయతీ సిబ్బందికి సరిపడు కార్యాలయానికి తగిన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనికొత్త భవన నిర్మాణానికి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించాము అనిఆర్ & బీ ఆఫీస్ ఆవరణ – సుమారు మూడు ఎకరాలు, ఆర్టీసీ స్టాండ్ ఆవరణ – సుమారు నాలుగు ఎకరాలు, వెటర్నరీ హాస్పిటల్ ఆవరణ – సుమారు అర ఎకరం, ఆయుర్వేద హాస్పిటల్ ఆవరణ – సుమారు నాలుగు కుంటలు. మొదలగుస్థలాల్లో అనువైన చోటు గ్రామ పంచాయతీ నూతన భవనానికి స్థలం మంజూరు చేయవలసిందిగా కోరినారు పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో, ప్రస్తుతం ఒకే ఒక్క ట్రాక్టర్ ఉన్నందున ఇంజిన్‌కు రిపేర్ ఖర్చు ఎక్కువవుతున్నందున ,నూతన ట్రాక్టర్ కొనుగోలు చేయుటకు అనుమతులు అవసరం అనిగ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి నూతన ట్రాక్టర్ ఆవశ్యకత ను కలెక్టర్ కు వివరించి నూతన ట్రాక్టర్ కొనుగోలుకు అనుమతి మంజూరు చేయాలని మరియు నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ అంకిత్ ను కలిసి విజ్ఞప్తి చేసారు, దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే మంజూరు కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ కు అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ధన్యవాదాలు తెలియచేశారు.