
జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఈ సందర్భంగా *బొమ్మెన.సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గత 50 సం॥రాల నుండి పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే అత్యధికులున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్క రూ.18,000/-ల వేతనం పెంచుతామని, పి.ఎఫ్ సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ ఎరియర్స్, పి.ఆర్.సి ఎరియర్స్ తదితర డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ తదితర ఇంకా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నాము. *బి.లలిత, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు* మాట్లాడుతూ ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఐపి-2020 చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ట్రంలో తెచ్చిన 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ పి.ఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించడం ద్వారా ఐసిడిఎస్ రక్షణతో పాటు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్క ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము.డిమాండ్స్ :ఆర్.సి.నెం. 830284(2102) / టిఎస్ఎస్ / పి.డి.జి/టి6/2025 సర్క్యులర్ తక్షణమే రద్దు చేయాలి. గతం, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రీ ప్రైమరీ, పి.ఎం. శ్రీ మొత్తం 4,131 కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలి. ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ వెంటనే ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ప్రతి నెల 1వ తేదీన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు వేతనాలు చెల్లించాలి. 15వేల ఖాళీ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలి. ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి.కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18,000/- ల వేతనం పెంచాలి. పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్ఫర్స్కు గ్రాట్యుటీ అమలు చేయాలి. 24 రోజుల సమ్మె వేతనాలు, మినీ టీచర్స్ 11 నెలల ఎరియర్స్, 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలపి.ఆర్.సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ అమలుచేయాలి. 2017 నుండి టిఏడిఏ లు, ఇంక్రిమెంట్, ఇన్చార్జ్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎస్ఆర్ఎస్ ను రద్దు చేయాలి. ఒకే ఆన్లైన్ యాప్ ఉండే విధంగా వెంటనే నిర్ణయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ పి 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలి. రాష్ట్రంలో ప్రీప్రైమరీ పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి.కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం బిఎల్ ఓ డ్యూటీలు రద్దు చేయాలి. ఐసిడిఎస్ కు సంబంధం లేని అదనపు పనులను చేయించకూడదు.కొత్తగా ఇచ్చిన సెల్‌ఫోన్స్ పని చేయట్లేదు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అన్ని యాప్స్ మరియు సౌకర్యాలతో 5జి నెట్వర్క్ ఫోన్స్ ఇవ్వాలి.జి.ఓ నెం. 14ను సవరించాలి. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి.24 రోజుల సమ్మె ఒప్పందం ప్రకారం ఈ మధ్య కాలంలో చనిపోయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం డబ్బులు చెల్లించాలి. సీనియార్టీని బట్టి ఇంక్రిమెంట్ నిర్ణయించాలి. మంత్రిగారి హామీ ప్రకారం కారుణ్య నియామకాలు త్వరగా నిర్ణయించాలి.ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.5/-లు, గర్భిణీ / బాలింతలకు రూ.10/-లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి.. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి . శైలజ, సాధన, పట్టణ అధ్యక్షురాలు*, తదితరులు పాల్గొన్నారు