
పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ముఖ్యఅతిథిలుగా హాజరు కావాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ లను ఆహ్వానించిన సభ్యులు
నంద్యాల: ఈనెల 21వ తేదీన మూలసాగరంలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామి దేవస్థానం నూతన చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వక నేడు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ లను కమిటీ సభ్యులు స్వయంగా కలిసి ఆహ్వానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన పాలక మండలిని ఆశీర్వదించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నరసింహులు,కెఎల్ దీపక్ రెడ్డి, కామిని మల్లికార్జున, విశ్వనాధ్, శివరామ్ రెడ్డి, చంటి తదితరులు ఉన్నారు.
