
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో ఈ నెల 25వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సీ.పీ.ఐ.శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీ.పీ.ఐ.యాడికి మండల కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీ.పీ.ఐ. మండలకార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ,సీనియర్ నాయకులువెంకట రాముడుయాదవ్, శ్రీరాములు,ఓబిరెడ్డి మాట్లాడుతూ,భారత కమ్యూనిస్టుపార్టీ దేశంలో స్థాపించబడి డిసెంబర్ నెలాఖరికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా యాడికి మండలంలో సీ.పీ.ఐ. పార్టీలోదీర్ఘకాలం సేవలందించిన నాయకులను,పార్టీ కోసం పోరాడుతూ అసువులుబాసిన నాయకుల కుటుంబాలను చిరు సత్కారంచేయాలని మండలకమిటీ తీర్మానంచేసినట్లు వెల్లడించారు.ఈనెల 25వ తేదీన జరిగే శతజయంతి వేడుకల్లో మండలంలోని సీ.పీ.ఐ.నాయకులు, కార్యకర్తలు,కార్మికులు పెద్ద సంఖ్యలోపాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనికోరారు.ఈ సమావేశంలోసీ.పీఐ. మండలసహాయ కార్యదర్శి వడ్డె రాముడు,చేనేత మండలకార్యదర్శి బండారురాఘవ, సీనియర్ నాయకులు గరిడీ శివన్న,నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.
