
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయండి…
అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ..
నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీ కు 300 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు మాట్లాడారు. తానూర్, కుబీర్ మండలాలకు సాగునీరు లేక ఆ ప్రాంతాలు ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నాయని, 500 కోట్ల రూపాయల నిధులతో అప్పట్లో 60 శాతం పనులను పూర్తి చేశారని ప్రస్తుతం పనులు పూర్తి కావాలంటే 300 కోట్ల రూపాయల అవసరమన్నారు. పనులు పూర్తయితే 50వేల ఎకరాలకు నియోజకవర్గంలో సాగునీరు అందుతుందని, నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. తానూర్, కుభీర్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, 500 ఫీట్ల వరకు వేసిన బోరు బావుల్లో నీళ్లు రావడంలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కలలుగన్న 28 ప్యాకేజ్ పూర్తి చేయడంతో పాటు, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు.