
ప్రజా సమస్యలకు గొంతుకగా 3 టీ టీవీ. ఎసిపి లక్ష్మీనారాయణ
( పయనించే సూర్యుడు జనవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని నియోజకవర్గ ఇన్చార్జ్ 3టి టీవీ రిపోర్టర్ వానరాశి జగన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను షాద్నగర్ ఫ్యూచర్ జోన్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్లు ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ…3టి టీవీ ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చే వేదికగా నిలుస్తోందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.3టి టీవీ ఇలాంటి బాధ్యతాయుత పాత్రను కొనసాగించడం అభినందనీయమన్నారు.
ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో పాటు మీడియా కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్లో 3టి టీవీ ముందుండటం సంతోషకరమన్నారు.పట్టణ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ…సత్యనిష్ఠమైన వార్తలతో ప్రజల్లో నమ్మకం సంపాదించుకోవడమే నిజమైన జర్నలిజమని అన్నారు.త్రీటి టీవీ అదే బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 3టి టీవీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో 3టి టీవీ న్యూస్ మరింత ప్రగతిపథంలో సాగాలని అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
