
సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్,
( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండల మొండోని రాయి గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ తేజ్య నాయక్ మరియు ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్. జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండలం ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్. మేగ్య నాయక్ యువ స్టార్ యూత్ అధ్యక్షులు శివ్ రాజ్ నాయక్ యువకులు పాల్గొనిసేవాలాల్ మహారాజ్ ఫోటో, శాలువాలతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులుపాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్లు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కోరారు. గ్రామ అభివృద్ధి పనులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.