పయనించే సూర్యుడు జనవరి 29(గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ:
అత్యవసర సమయంలో రక్తదానం చేసి మరొకసారి మానవతాదృక్పధం చాటుకున్నాడు వేములవాడ పట్టణానికి చెందిన తొగరి కరుణాకర్ ( విలేకరి ) 37 వ సారి AB + పాజిటివ్ పట్టణంలోని అమృత నర్సింగ్ హోం లో సుభాష్ నగర్ కీ చెందిన పోతారం బొందయ్యా 70 ఏళ్ల వృద్ధునికి రక్తదానం చేసాడు. ఇప్పటికి గర్భిణీ స్త్రీలకు 20 సార్లకు పైగా డెలివరీ సమయంలో దానం చేసాడు. యాక్సిడెంట్ కేసులు, వృద్ధులకు 17 సార్లు వివిధ ఆసుపత్రిలో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తన జీవిత కాలంలో 100 సార్లు పైగా దానం చేయడమే తన కర్తవ్యం అని తెలిపాడు. ఆసుపత్రి డాక్టర్ ఆనందరెడ్డి , విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావు తదితరులు కరుణాకర్ ను అభినందించారు