
పయనించే సూర్యుడు ఆగస్టు 18మక్తల్ : స్థానిక యాదవ్ నగర్ లోని నాగుల దేవాలయంలో గత ఐదు సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగి స్తూ ఈ ఏడాది కూడా శ్రావణమాసం సందర్భం గా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భారీ ఎత్తున అన్నదానం కూడా నిర్వహించారు.ఐదు రెండు సంవత్సరాల క్రితం నాగుల దేవాలయం పునర్నిర్మాణం జరిగినప్పటి నుండి ప్రతి శ్రావణమాసంలోనూ ఈ పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదు సంవత్సరం కార్యక్రమాన్ని నాగుల దేవస్థానం కమిటీ సభ్యులు తమ ఆధ్వర్యంలో విజయవం తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ నగర్ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవం తం చేశారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగుల దేవత ఆశీస్సులు పొందారు.