నిరాశ్రయిలను తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన దృశ్యం..
రుద్రూర్, ఆగస్టు 18 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నివాస గృహాలు నీటిలో మునిగి దాదాపు 40మంది నిరాశ్రయిలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పునరావాసం కేంద్రం కింద స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల బాలికల హైస్కూల్ యందు వారికి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుచేసి వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజన ఏర్పాటు కల్పించి వారికి ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇందూర్ కార్తీక్, షేక్ నిసార్, పార్వతి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.