ఖోఖో, వాలీబాల్లో ప్రతిభ జిల్లా స్థాయికి అర్హత
పయనించే సూర్యడు/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉప్పల్ జోనల్ లెవెల్లో జరిగిన 69వ ఆట పోటీలలో మోడ్రన్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానాలు సాధించారు. ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో మండలానికి చెందిన 35 స్కూళ్లు, 80 టీములు పాల్గొన్నాయి. ఈ క్రమంలో మోడ్రన్ స్కూల్ విద్యార్థులు ఖో ఖో సీనియర్ బాయ్స్, గర్ల్స్, జూనియర్ బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో మొదటి బహుమతి సాధించి జిల్లా స్థాయికి అర్హత పొందారు. అదేవిధంగా వాలీబాల్ అండర్-17 గర్ల్స్ విభాగంలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. మోడ్రన్ స్కూల్ విజయాలు 1వ స్థానం – యు-17 బాయ్స్ ఖో ఖో 1వ స్థానం – యు-17 గర్ల్స్ ఖో ఖో 1వ స్థానం – యు-14 బాయ్స్ ఖో ఖో 1వ స్థానం – యు-14 గర్ల్స్ ఖో ఖో 2వ స్థానం – యు-17 గర్ల్స్ వాలీబాల్ ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సచీదేవి మాట్లాడుతూ, మా విద్యార్థులు ఆటలలో చూపుతున్న ప్రతిభ పట్ల గర్వంగా ఉంది. జిల్లాస్థాయిలో కూడా అద్భుత ఫలితాలు సాధిస్తారని నమ్మకం ఉంది అన్నారు. హెచ్ఎం లక్ష్మీ ప్రసన్నం మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటలు, వ్యాయామం విద్యార్థులకు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా మోడ్రన్ స్కూల్ విద్యార్థులు మండల, జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలలోనూ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఆటలలో రాణించిన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడు నరేంద్రను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ విజయంపై మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామారావు, ఉప్పల్ స్కూల్ జిహెచ్ఎం శిరీష, జోనల్ ఇంచార్జ్ పద్మావతి, నాగోల్ పీడీ శంకర్, మమత తదితరులు మోడ్రన్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. ఈ పోటీల్లో మోడ్రన్ స్కూల్ నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం.