పయనించే సూర్యుడు సిహెచ్.విద్యాసాగర్ జనవరి:-26 దేవీపట్నం మండలం:- అల్లూరి జిల్లా(పాడేరు)రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చొప్పకొండ గ్రామపంచాయతీ కుటకరాయి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జనవరి 26 న 76.వ గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) వేడుక ఘనంగా జరిగింది.భారతదేశ జాతీయ జెండాను ప్రధానోపాధ్యాయుడు కుంజం రవికుమార్ దొర చేతుల మీదగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు కుంజం రవికుమార్ దొర అలాగే ఉపాధ్యాయురాలు సవలం నాగమణి ఈ గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే)ఉపాధ్యాయులు మాట్లాడుతూ...భారతదేశానికి వ్యాపారం కోసం మన దేశంలోకి ఆంగ్లేయులు(బ్రిటిష్) వారు ప్రవేశించి,వనరులు దోచుకోవడానికి నిశ్చయించుకొని, దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులు (బ్రిటిష్) వారు భారతదేశంపై పట్టు సాధించారు.'విభజించి పాలించు'అనే విధానం అవలంభించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు.దాదాపు రెండు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయులు(బ్రిటిష్) పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 సంవత్సరంలో విముక్తి లభించింది.1947 ఆగస్టు 15 న స్వాతంత్ర వచ్చినా 1950 వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది.స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26 న భారతదేశం(భారత్)అవతరించింది.అదే గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే)ఈ కథనంలో భారత గణతంత్ర దినోత్సవ,స్వాతంత్ర సమరయోధుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఎస్ చైర్మన్ ఎస్.అబ్బాయి రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్.రాజమ్మ,అంగన్వాడీ టీచర్ ఎస్.సావిత్రి వి.శ్రీనివాస్ దొర ఎస్.వెంకటేష్ రెడ్డి ఎస్.దుర్గారాణి ఎస్. పండమ్మ ఎస్.శ్రీనివాస్ రెడ్డి ఎస్.సాయికిషోర్ రెడ్డి చిహెచ్.బాబుజి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.