పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్:- టంగుటూరు మండల రెవిన్యూ కార్యాలయంలో 76 వ ఘనతంత్ర వేడుకల్ని యం.ఆర్.ఓ ఆంజనేయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మాజీ యం.పి.పి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. మన ప్రభుత్వాన్ని మనమే పరిపాలించుకునే విధంగా మన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తి కి నిదర్శనమని జయంత్ బాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వెంకటేశ్వర్లు,డిటి శ్రీనాధ్, కార్యాలయసిబ్బంది పాల్గొన్నారు.
టంగుటూరు పట్టణ పోలీసు స్టేషన్ లో జెండా వందన కార్యక్రమాన్నీ నిర్వహించారు.