
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణంలోని భైంసా జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించి,అనంతరం వందేమాతర గేయము,జాతీయ గీతాన్ని ఆలపించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరడం జరిగింది.అదే విధంగా కార్యక్రమంలొ పాల్గొన్న ప్రతి ఒక్కరికి 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు . అదే విధంగా కార్యక్రమంలో భాగంగా ప్రజా ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పత్రిక సోదరులు, లైబ్రరీ అభ్యర్థులు తదితరులు పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేయడం జరిగింది.