పయనించే సూర్యుడు జనవరి 29 (మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి) మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గీతాంజలి ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ఫ్యూషన్ 2025 ఫిబ్రవరి 28 మార్చి1 తేదీలలో నిర్వహించనున్నారు. బుధవారం గీతాంజలి కాలేజీలో పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఛైర్మన్ రవీందర్ రెడ్డి,ప్రిన్సిపాల్, డైరెక్టర్, వైస్ ఛైర్మన్, డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఫ్యూషన్ 2025 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప వేదికగా నిలుస్తుంది. బిటెక్ ఎంటెక్ విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చు. ఈ వేడుకలో పలు క్రీడా పోటీలు నిర్వహించబడతాయి, విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు సర్టిఫికేట్లు అందజేయబడతాయి. ప్రత్యేకంగా విద్యార్థులకు ఉద్దేశించిన ఈ పోటీలను విజయవంతం చేయడానికి మీరందరూ పాల్గొని,క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి.నమోదు మరియు మరిన్ని వివరాల కోసం ఫీజికల్ డైరెక్టర్ యారాల అమర్నాథ్ రెడ్డి చరవాణి నెంబర్ 9652899699 నీ సంప్రదించగలరు.