పయనించే సూర్యుడు జనవరి 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్:-అశ్వారావుపేట : కమ్మ సేవా సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ ను ఆ సంఘ నాయకులు సుంకపల్లి వీరభద్రం ఇంటి వద్ద సమైక్యరాష్ట్ర ప్రదినిధులు గంగవరపు రామకృష్ణప్రసాద్, కండేపనేని రత్నాకర్ సారథ్యంలో కమ్మ సేవా సమితి అశ్వారావుపేట మండలం నాయకత్వం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులు మాట్లాడుతూ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని, కమ్మ సేవా సమితి సభ్యులందరూ ఐక్యంగా ఉండి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు, నున్న కృష్ణారావు, ఆండ్రు ప్రసాద్, కరుటూరి సత్యనారాయణ, ఆండ్రు నరసింహమూర్తి, తలశిల బాలకృష్ణ, అల్లూరి వెంకట రామారావు, గాలి ఉదయ్ రాఘవేంద్ర, కోడూరి శ్రీనివాస్, అల్లూరి నవీన్, సంకురాత్రి సతీష్, మార్ని జగన్ మోహన్, తుమ్మల నాగేశ్వరరావు, పొనగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.