పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్:- తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏరియా కమిటీ వందలాది విద్యార్థులతో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఆర్ డి ఓ అఫీస్ వరకు ర్యాలీ, ధర్నా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం,నరేందర్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత సంఘం పిడిఎస్ యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వందల మంది విద్యార్థులతో న్యూ బస్టాండ్ నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా * పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ లు* మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటివరకు విడుదల చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరించడం సరైన విధానం కాదు.
మరియు గత ప్రభుత్వం లోని కెసిఆర్ వేల కోట్ల రూపాయలు విద్యార్థుల స్కాలర్షిప్ లను పెండింగ్లో పెట్టి ,విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం, నిర్వీర్యం చేశారు. 4ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా కెసిఆర్ దారిలోనే నడుస్తుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.. ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించని రేవంత్ రెడ్డి సర్కస్ సిగ్గుతో తలదించుకోవాలి. స్కాలర్షిప్లు రాక ప్రైవేట్ యజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని వారు విద్యాసంస్థలను మూసివేసి వారి తాళం చెవిని యూనివర్సిటీలో పెట్టి వెళ్తామని అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక వైఖరి వల్ల విద్యార్థులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారని కావున ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్. ఏరియా నాయకులు మమత, వినోద్, సాయిరాజ్, మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు