పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి
పయనించే సూర్యుడు జనవరి 29 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )లిఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన భూ భారతి చట్టం ఇతర భూ చట్టాలపై అవగాహన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రతి రైతు భూభారతి చట్టంపై అవగాహన కల్పించుకోవాలని తెలిపారు గ్రామాలలో వందల తొంబై శాతం రైతులకు ధరణితో ఇబ్బందులు ఉన్నాయని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసిందని భూమి సునీల్, కోదండ రెడ్డి భూభారతి అనేక వీడియోలు చేసినారని యూట్యూబ్లో కొట్టుకొని చూసి అవగాహన తెచ్చుకోవాలని ఆమె కోరారు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ భూ భారతి చట్టం రూపకర్త భూమి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు సదస్సులో ప్రతినిధులు విరివిగా ప్రసంగించారు. శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి భూ భారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతుల హక్కులు మరియు భూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు భూ సంస్కరణలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. భూమి సునీల్ భూ భారతి చట్టం యొక్క ముఖ్యాంశాలను వివరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ చర్యలను వివరించారు