ములకలపల్లి ,జనవరి 28,పయనించే సూర్యుడు.యూసఫ్
ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేసిన ములకలపల్లి ఎస్సై కిన్నెర రాజశేఖర్ ములకలపల్లి ,జనవరి 28, వారంతా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులు, తీవ్రమైన చలితో ఆదివాసి గూడాల జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిసి జెపిఆర్ ఫౌండేషన్ చలించింది. తమ వంతు సహాయంగా ఆయా ఆదివాసి గూడాల వృద్ధులకు, కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలిచింది. ములకలపల్లి మండలంలోని పాత గుండాలపాడు గ్రామపంచాయతీ లోని పాలవాగు, ఓర్రె గుంపు, రెండు ఆదివాసీ గూడెం లలో చలి తీవ్రత ఎక్కువ ఉందని తెలియడంతో మంగళవారం జె పి ఆర్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములకలపల్లి ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ హాజరై అన్ని ఆదివాసి కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ గారు మాట్లాడుతూ. శీతాకాలంలో చలి తీవ్రత నుండి రక్షించటానికి ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేసిన జెపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజుని అభినందించారు, మరియు ఆదివాసీ కుటుంబాల లోని చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తో విద్య అవకాశాలు, ఆదివాసీలకు ఉన్నటువంటి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య అవగాహన సూచనలు అందించారు. ఎవరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు, కానిస్టేబుల్ తిరుపతిరావు , తంబర్ల నరసింహారావు , మధు, రాము, కోశయ్య , హరి తదితరులు పాల్గొన్నారు.