చారిత్ర కలిగిన గ్రామానికి దక్కని గౌరవం..
మండల కేంద్రంగా చేయాలని మోరపెట్టుకున్న పట్టించుకోని గత ప్రభుత్వం..
చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామంపై సర్కార్ చిన్నచూపు..
తొలి ముఖ్యమంత్రి గ్రామాన్ని బూర్గుల ను పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన..
హైదరాబాద్ రాష్ట్రనికి తొలి ముఖ్యమంత్రి గ్రామాన్ని మండలం ఏర్పాటు చేయక పోవడం శోచనీయం..
( పయనించే సూర్యుడు జనవరి 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ నగర్ మండల పరిధిలో బూర్గుల గ్రామం. బూర్గుల గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం నుండి పుట్టుకొచ్చిన నాయకుల్లో బూర్గుల రామకృష్ణారావు అగ్రగణ్యులు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ ఎమ్మెల్యేగా ప్రస్థానం ఉంది. ఆయన సోదరుడు స్వాతంత్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు పేరెన్నిక గన్నవారు. ఇందులో ముఖ్యంగా బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు.అలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్న బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లో మండలాలు ఏర్పాటు చేసింది దాంతో బూర్గుల గ్రామం మండలం గా ఏర్పాటు చేస్తారని గ్రామస్తులు ఆశించారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కానీ గ్రామస్తుల కోరికను పరిగణలోకి తీసుకోలేదు తమ గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని కోరిన బూర్గుల గ్రామాన్ని పట్టించుకోలేదు.గత ప్రభుత్వం కొన్ని మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. కానీ బూర్గుల గ్రామాన్ని మాత్రం పట్టించుకోలేదు.చారిత్రక గ్రామమైన బూర్గులను సర్కార్ మరోమారు ఆలోచించి మండల కేంద్రంగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చారిత్రక గుర్తింపు కలిగి అన్ని అర్హతలు ఉన్నా బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రం చేయకుండా విస్మరించడం బాధాకరం ప్రభుత్వం స్పందించపోవడం విచారకరం అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు..