
పయనించే సూర్యుడు అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆధ్వర్యంలో రాజోలులో ఆదర్శ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో శ్రీ రామేశ్వర స్వామి శివాలయ ప్రాంగణం వేదికగా డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో పర్యావరణ హితంగా, ఏవిధమైన డీజేలు, బాణసంచాలు ఉపయోగించకుండా గణపతి నవరాత్రులు నిర్వహించిన నూటపది మండపాల వారికి ఈ కార్యక్రమంలో మట్టి గణపతి ఉత్సవ పురస్కారాలను అందజేసారు. ఈ సందర్భంగా కాట్రేనికోన నుంచి ప్రతీ సంవత్సరం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ అలాగే మట్టి గణపతి మండపాన్ని నిర్వహిస్తున్న ఫ్రెండ్లీక్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రిని ఉత్సవ కమిటీ సభకు అధ్యక్షత వహించిన శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయదత్త నాగానంద సరస్వతి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఉత్సవ కమిటీ తరపున జిల్లా అధ్యక్షుడు భాను ప్రకాష్ మొమెంటో అందజేసారు. కార్యదర్శి శిష్టా కామేశ్వర రావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా వినాయక నిమజ్జనం కమిటీ అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ, రంబాల సుభాష్ చంద్రబోస్, ఆశపు సూరిబాబు, మల్లాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగయ్య శాస్త్రిని పలువురు అభినందించారు.
