
పయ నించే సూర్యుడు నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధినవంబరు 11: కార్తీక శుద్ధ విదియ సందర్భంగా బుధవారం భగినీ హస్త భోజనం పండుగను ఆనందోత్సాహాల తో జరుపుకున్నారు. సోదరులు, తమ సోదరి ఇళ్లకు వెళ్లి ఆమె చేతితో వండి వడ్డించిన ఆహారపదార్థాలను భుజించారు. అనంతరం సోదరీలు తమ సోదరుడు నుదుట తిలకం దిద్ది హారతిచ్చి అతని సుఖసంతోషాలు, ఆరోగ్యం దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించారు. అలాగే సోదరికి సోదరులు కానుకలను అందజేశారు. సోదరికి కానుకలు ఇస్తున్న సోదరుడు. సోదరుడికి భోజనం వడ్డిస్తున్న సోదరి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఒకచోట చేరి ఈ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడిపారు. ఈ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.