
పయనించే సూర్యుడు నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారి సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తుల సాయి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని అన్నారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్ గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీలో చేరామని తెలిపారు. పార్టీలో చేరిన వారికి గుత్తుల సాయి గారు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.