
సర్పంచ్ మేగవత్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్
కుందేలు కుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పాల్గొన్న ఉప సర్పంచ్ వార్డు సభ్యులు
( పయనించే సూర్యుడు నవంబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం పరిధిలోని కుందేలు కుంట తండా గ్రామపంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ... గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికి అందే విధంగా నిరంతరం కృషి చేస్తామని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామపంచాయతీ పాలన సాగుతోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ తో పాటు ఉపసర్పంచ్ రాము వార్డు సభ్యులు రవి, పద్మ సురేష్ నాయక్, లక్ష్మి, పెంట్య నాయక్, శోభ రాజు నాయక్, లోకేష్ నాయక్, కవిత రమేష్ నాయక్, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.