
*ఒకే రోజు 202 దూడలకు నట్టల నివారణ మందులు – రైతుల ఇంటి ముంగిటకే పశువైద్య సేవలు*
పయనించే సూర్యుడు, నవంబర్ 01,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కాలువ బజార్లో తెలంగాణ ప్రభుత్వం, పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ సిబ్బంది రైతుల ఇంటి ముంగిటకే వెళ్లి దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ రోజు మొత్తం 202 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.చిన్న వయస్సులోనే దూడలకు నట్టల నివారణ మందులు వేయించడం వల్ల అవి ఆరోగ్యంగా పెరిగి, వాటి ఎదుగుదల మెరుగుపడుతుందని, భవిష్యత్తులో పాడి రైతులకు మంచి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పశువైద్య అధికారులు వివరించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అదేవిధంగా, ఈ కార్యక్రమంలో ఇంకా నట్టల నివారణ మందులు వేయించుకోని రైతులు ఎవరైనా మిగిలి ఉంటే, వారు స్థానిక పశువుల ఆసుపత్రిని సందర్శించి తమ దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ డాక్టర్ ఫర్హానా బేగం, వారి సిబ్బంది, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు, వార్డు సభ్యులు చింతల అనుపమ, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.