

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ బోధన్ రహదారి పై బోధన్ వైపు వెళుతున్న టిఎస్ 16 యుఏ 0344 నంబర్ గల ఆటోపై భారీ వృక్షం కూలడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వర్ని మండలం పెద్దగుట్ట గ్రామానికి చెందినవారుగా స్థానికులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.